Magazines

ఆర్టీసీ ఎన్నికల్లో ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌‌, టీడబ్ల్యూయూ కూటమిని గెలిపించండి

3 గంటల క్రితం

Elect the SWF-TWU alliance in the RTC elections.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

కార్మికులకు సీఐటీయూ విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్న ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌‌, టీడబ్ల్యూయూను గెలిపించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ కార్మికులకు విజ్ఞప్తి చేసింది. గత11 సంవత్సరాల తెలంగాణలో ఏడు సంవత్సరాల కాలం ఆర్టీసీ కార్మికోద్యమంపై ఆంక్షలు, తీవ్ర నిర్భంధం కొనసాగిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌తెలిపారు. గత ఏప్రిల్ 22-24 ఐక్య పోరాటం ఒప్పందంలో భాగంగా కార్మిక సంఘాల నిర్భంధం ఎత్తివేసి, ఎన్నికలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చిందని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఆర్టీసీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. టీజీఎస్‌ఆర్టీసీలో అక్టోబర్ తొమ్మిదిన గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఆ ఎన్నికల్లో సీఐటీయూ అనుబంధ టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ ,వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్‌), తెలంగాణ ఆర్టీసీ వర్కర్ల యూనియన్‌ (అశ్వత్థామరెడ్డి) ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని చెప్పారు. ఖమ్మం, నల్లగొండ రీజియన్లో సీఐటీయూ అనుబంధ స్టాఫ్ , వర్కర్స్ ఫెడరేషన్ స్థానిక గుర్తింపు (క్లాజు-6)కు పోటీ చేస్తుండగా, మిగతా తొమ్మిది ఆపరేషన్ రీజియన్లల్లో నాలుగు నాన్ ఆపరేషన్లల్లో స్థానిక గుర్తింపు (క్లాజు-6)తో పాటు రాష్ట్ర గుర్తింపు (క్లాజు-3)కు తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ పోటీ చేస్తున్నదని వివరించారు. ఈ కూటమికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నదని తెలియజేశారు. సీఐటీయూ జిల్లా కమిటీలు, మండల సమన్వయ కమిటీలు, గ్రామ సమన్వయ కమిటీలన్నీ ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌‌, టీడబ్ల్యూయూ కూటమి గెలుపుకు కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ అన్ని స్థాయిల్లోని శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నదని తెలిపారు. కూటమిని బలపరిచి గెలిపించాలని ఆర్టీసీ కార్మికులను కోరింది. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ​టీపీసీసీ మద్దతు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలలో తెలంగాణ వర్కర్స్ యూనియన్(టీడబ్లూయూ) ) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ కు తమ తమ జిల్లాలలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు పీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌‌ను ఎన్నికల ఇన్‌‌ఛార్జిగా నియమించినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్