Magazines

విషాదం.. ఉరేసుకుని వ్యక్తి మృతి

7 గంటల క్రితం

dies
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -  అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి తగరం సిద్దయ్య ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యయాతి రాజు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మోడల్ కాలనీకి చెందిన తగరం వెంకటేశ్వరరావు (35) మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తుండడంతో భార్య స్వర్ణలత తరచూ వారించేది. ఈ క్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఆదివారం ఇద్దరూ దమ్మపేట మండలం మందలపల్లి సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుతున్న తమ కుమారులను చూసి తిరిగి వస్తుండగా వెంకటేశ్వరరావు మద్యం సేవించాడు. దీంతో భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకోగా, స్వర్ణలత తన పుట్టిల్లు అయిన ఆసుపాకకు వెళ్లిపోయింది. అనంతరం ఇంటికి వచ్చిన వెంకటేశ్వరరావు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. చాలాసేపైనా బయటకు రాకపోవడంతో తల్లి సోమాలమ్మ కిటికీ నుంచి చూడగా అతడు ఉరికి వేలాడుతూ కనిపించాడు.

స్థానికుల సహాయంతో వెంటనే అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యయాతి రాజు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్