Magazines

సమాజంలో జేవీవీతో మార్పు

57 నిమిషాల క్రితం

Bringing about change in society through JVV.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

ఉస్మానియా యూనివర్సిటీలో జన విజ్ఞాన వేదిక సబ్ 
కమిటీల కాన్ఫరెన్స్
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
సమాజంలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక (జేవీవీ) వంటి సంస్థల పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రియాజ్ అన్నారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాలలో ఆదివారం సబ్ కమిటీల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైన్స్ సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో శాస్త్రీయ విజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో శాస్త్ర విజ్ఞానంపై అపోహలు, మూఢనమ్మకాలు వ్యాప్తి చెందకుండా శాస్త్ర కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ రజిని ప్రియ మాట్లాడుతూ.. సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగమైందని అన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జన విజ్ఞాన వేదిక తన కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక 6వ రాష్ట్ర మహాసభల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజా, సబ్ కమిటీ కన్వీనర్లు ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య, డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు, డి. విమల, ఎస్పీ లింగస్వామి, టి. శ్రీనాథ్, ధర్మ ప్రకాష్, శివ నారాయణ, హైదరాబాద్ నగర నాయకులు రాహుల్, రవీంద్రబాబు, డాక్టర్ పి. రజిని, శాంతి ఇషాన్, సుబ్బారావు, ఎన్. శ్రీనివాస్, వసుంధర, సుచిత్ర, విద్యాసాగర్, సూర్యనారాయణ, యాదగిరి తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్