డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో రూ.7.90 కోట్ల పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-చింతకాని
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల కు కొత్త శోభ రావడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. చింతకాని చెరువు వద్ద రూ.7.90 కోట్లతో పర్యాటక వసతుల కల్పన, పందిళ్లపల్లి నుంచి అనంతసాగర్ మీదుగా చింతకాని జెడ్పీ రోడ్డు వరకు రూ.4 కోట్లతో బీటీ రోడ్డు, జగన్నాధపురంలో ఖమ్మం–బోనకల్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి న్యూ మార్కెట్ మీదుగా మత్కేపల్లి–పందిళ్లపల్లి వరకు రూ.4.50 కోట్లతో పంచాయతీరాజ్ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నరసింహాపురం ఎస్సీ కాలనీలో రూ.18 లక్షల తో సీసీ రోడ్లు, నాగులవంచ నుంచి రైల్వే కాలనీ అండర్ పాస్ వరకు రూ.5 కోట్లతో బీటీ రోడ్డు పనులు చేపట్టను న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వం సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళల ఆర్థిక బలోపేతానికి వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మెన్ పువ్వాల దుర్గాప్రసాద్, స్థానిక సర్పంచ్ కిలారు మనోహర్ బాబు, మడుపల్లి భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మత్కేపల్లి మార్కెట్ చైర్మెన్ అంబటి వెంకటేశ్వరరావు, బందెల నాగార్జున, పీఆర్‌ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసచారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యుగంధర్ రావు, సీపీఓ శ్రీనివాస్, వివిధ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక వసతులతో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ
56 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)