Magazines

మేఘా ‘పింక్‌ పవర్‌ రన్‌ 3.0’

1 గంట క్రితం

Megha ‘Pink Power Run 3.0’
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు 
కదలిన రన్నర్స్‌
వతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన...మహిళల ఆరోగ్య సంరక్షణ, సాధికారతకు మద్దతుగా హైదరాబాద్‌ పరుగులు తీసింది. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌), సుధా రెడ్డి ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘పింక్‌ పవర్‌ రన్‌ 3.0’కు ఆదివారం అపూర్వ స్పందన లభించింది. హుస్సేన్‌సాగర్‌ తీరంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభమైన ఈ మెగా కమ్యూనిటీ రన్‌లో దాదాపు 35 వేల మందికి పైగా రన్నర్స్‌ పాల్గొన్నారు. తెల్లవారుజామునే నెక్లెస్‌రోడ్‌ పరిసరాలు రన్నర్లతో కిక్కిరిశాయి. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ముందస్తు వైద్య పరీక్షలు, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం...హైదరాబాద్‌లో అతిపెద్ద కమ్యూనిటీ ఫిట్‌నెస్‌ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఐదేండ్లలో చిన్నారులతో పాటు 80 ఏండ్లకు పైబడిన వృద్ధులు, వికలాంగులుకూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం స్ఫూర్తిని చాటారు. 21 కి.మీ హాఫ్‌ మారథాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో స్పందన లభించింది. అమెరికా, ఇంగ్లాండ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇథియోపియా, ఉగాండా, శ్రీలంక, ఐస్‌లాండ్‌, టాంజానియా, బోట్స్వానా, కెన్యా, కెనడా తదితర దేశాల నుంచి రన్నర్లు పాల్గొన్నారు. దేశ, విదేశాలకు చెందిన రన్నర్లతో నెక్లెస్‌రోడ్డుపై అంతర్జాతీయ క్రీడా వాతావరణం నెలకొంది. పింక్‌ పవర్‌ రన్‌ను తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌, ఎంఈఐఎల్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణారెడ్డి, సుధా రెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సుధా రెడ్డి, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ లారా విలియమ్స్‌, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ (ఈవీ ట్రాన్స్‌) ఉపాధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. సినీ నటుడు సిద్దు జొన్నలగడ్డ, మాజీ ప్రపంచ సుందరి ఓపల్‌ సుచేత, భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌, నారాయణ గ్రూప్ విద్యాసంస్థల డైరెక్టర్ పునీత్, అవినాష్ గ్రూప్ సంస్థల చైర్మెన్‌ అవినాష్ తదితరులు పా‌ల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్