నవతెలంగాణ-ఆత్మకూర్
ఆత్మకూరు మండల పరిధిలోని తిప్పడంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా. భాస్కర్ నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సిలోని అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచాలని, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే పీహెచ్సిలో ప్రసవాల (డెలివరీల) సంఖ్యను మరింత మెరుగుపరచాలని వైద్య సిబ్బందికి సూచించారు.
తిప్పడంపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
2 రోజుల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)