Magazines

మిడ్జిల్‌లో వైభవంగా గణేష్‌ నిమజ్జనం

5 రోజుల క్రితం

midjil
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్ 
మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో గణపతి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. గ్రామంలోని వివిధ వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పు వాయిద్యాలు, తీన్మార్ డాన్సులు, భజనల కోలాహలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు జైజైధ్వానాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. శోభాయాత్ర అనంతరం స్థానిక చెరువులలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి లడ్డును వేలంలో అక్ష‍రాలా ఒక్క లక్ష యాభై ఒక్క వేయి రూపాయలకు జరుపుల సరోజ భాస్కర్ నాయక్ దక్కించుకున్నారు.


ఈ సందర్భంగా గణపతి లడ్డు విజేతను నిర్వాహకులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. వినాయకుడి కృపతో ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు ఆకాంక్షించారు.


మిడ్జిల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధికారిక గణపతి నిమజ్జన శోభాయాత్ర, లడ్డు వేలం వేడుకలు స్థానిక మండల కేంద్రంలో అత్యంత క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో జరిగాయి. గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ  చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహ్మద్ గౌస్, మాజీ జెడ్పిటిసి సభ్యులు హైమావతి బాల్ రెడ్డి, సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్, స్వచ్ఛంద సేవకులు జరుపుల భాస్కర్ నాయక్, వ్యాపార సంఘం మండల అధ్యక్షులు గంజి కృష్ణ, విగ్రహ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బరిగల శ్రీనివాసులు, రాజేశ్వర్, పల్లె తిరుపతి, గంజి శేఖర్, శ్రీనివాసులు గుప్తా, విజయ్, మామిడి మాడ శంకర్, భాస్కర్, నరసింహ, ఏదుల కృష్ణ , రవీంద్ర, భాస్కరాచారి వివిధ గ్రామాలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్