Magazines

విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రేబిస్‌ నిర్మూలనపై అవగాహన

1 గంట క్రితం

rebis
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - బల్మూరు 

మండలంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రేబిస్‌ నిర్మూలనపై విద్యాధికారి డా. విష్ణు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నషా ముక్త యువ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత, ఆరోగ్యకరమైన జీవనశైలి, యువత భవిష్యత్తును విద్యార్థులు కాపాడుకోవాలని సూచించారు.

అలాగే ప్రపంచ రేబిస్ దినోత్సవం (సెప్టెంబర్ 28) సందర్భంగా కుక్కలు, ఇతర జంతువులు కరిచినప్పుడు గాయాన్ని వెంటనే సబ్బు, నీటితో శుభ్రంగా కడగడం, ఆలస్యం చేయకుండా వైద్య కేంద్రాన్ని సంప్రదించడం, అవసరమైన రేబిస్ వ్యాక్సిన్, ఇతర చికిత్సలు పొందాలని పేర్కొన్నారు. పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా రేబిస్‌ను నివారించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేజీబివి ప్రిన్సిపాల్ లలిత మేడమ్, ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాసులు, శాంత, హెల్త్ అసిస్టెంట్ శ్రీశైలం , గంగ్య,, ఆశా కార్యకర్తలు సమన్వయంతో నిర్వహించి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు కళాశాల సిబ్బందికి అవగాహన కల్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్