నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులపై సోమవారం సోషల్ ఆడిట్ గ్రామసభ నిర్వహించారు. మార్చి 31, 2026 వరకు గ్రామంలో చేపట్టిన 28 రకాల పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ పరిశీలనాధికారి శ్రీకాంత్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్‌బాబు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ప్రతి కుటుంబానికి సంబంధించిన పనులు, వేతనాలు సక్రమంగా అందాయా లేదా అనే అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. సోషల్ ఆడిట్ వల్ల పనుల్లో పారదర్శకత, నాణ్యత పెరగడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు పథకంపై అవగాహన పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భవాని, టీఏ చారి, వార్డు సభ్యులు చౌడబోయిన అనిత, లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ ఉడుగుల శ్రీనివాస్, ఉపాధి హామీ మేట్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






కామెంట్లు (0)