నవతెలంగాణ-హైదరాబాద్: భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా, ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, ఇతర వామపక్ష నాయకులు.. సోమవారం న్యూఢిల్లీలోని గోల్ మార్కెట్‌లో ఉన్న అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహం వరకు ఏకేజీ భవన్ నుండి పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా వామపక్ష నాయకులు భగత్ సింగ్‌కు నివాళులర్పించి, ఓటు హక్కును, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, ఆర్.అరుణ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యులు అనురాగ్ సక్సేనా, విక్రమ్ సింగ్, వి.మురళీధరన్, రాజేంద్ర శర్మ, రాజ్యసభ సభ్యులు వి.శివదాసన్, ఏ.ఏ.రహీమ్, తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ 119వ జయంతి: సీపీఐ(ఎం) నేతల నివాళి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)