నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కొట్టాల గ్రామంలో శనివారం మహిళా సమైక్య భవనం ఏర్పాటుకు మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు స్థల పరిశీలన చేశారు. ఆ స్థలాన్ని గ్రామ సర్పంచ్ కల్లెట్ల లింగయ్య స్వాధీనపరిచి, మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి పనులను వెంటనే ప్రారంభించాలని పిఆర్ఏఈకి, సంబంధిత అధికారులకు తాహసిల్దార్ ఆదేశాలు జారి చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సమైక్య భవనానికి స్థలం పరిశీలన
6 రోజుల క్రితం
Shiva Kumar
ప్రచురించబడింది సెప్టెం 19, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)