నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు రైల్వే స్టేషన్ ఎదురు గల్లీలో వి యూత్ అసోసియేషన్ వినాయకుడి వద్ద ఆదివారం జరిగిన వేలంపాటలో రూ. 2 లక్షల 76 వేలకు గంప కృష్ణ వినాయకుడి లడ్డుని దక్కించుకున్నారు. గత సంవత్సరం కంటే 1,20,000 అధికంగా ఈసారి వేలం పాట జరిగింది. వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఆ లడ్డుని ఆయన ఇంటి వద్దకు బ్యాండ్ మేళాలతో తీసుకొని అప్పగించారు. దీంతో ఆలేర్ పట్టణంలో, మండలంలో పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చనీయాంశమైంది.






కామెంట్‌లు (0)