Magazines

సోలార్ అపెక్స్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్

03 సెప్టెంబర్, 2026

inauguration
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - కామారెడ్డి

పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ అపెక్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి  అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు అందించేందుకు నూతన వ్యాపార సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.


పీఎం సూర్య ఘర్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని ప్రజలు సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చన్నారు. సోలార్ అపెక్స్ షాప్ ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు, ఉపయోగకరమైన సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ సంస్థ మరింత అభివృద్ధి సాధించి విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అంజాద్, గణేష్, కో-ఆప్షన్ సభ్యుడు ముబాషీర్, నాయకులు నాగరాజు, శ్రీనివాస్, రాజీవ్, అఖిల్, ప్రశాంత్, నితీష్, షాప్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్