Magazines

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

24 ఆగస్టు, 2026

acb
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో అడ్మిన్‌ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై డీఎస్పీ ఆనంద్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తులు, పత్రాలు, కీలక ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి గతంలో మహేశ్వరం తహసీల్దార్‌గా పనిచేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్