Magazines

ఆర్‌ఎంపీ, పీఎంపీ మండల అధ్యక్షుడిగా కైలాసం

55 నిమిషాల క్రితం

Kailasam as RMP and PMP Mandal President
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

- నూతన కమిటీ ఎన్నిక.. రెండేళ్ల పాటు కొనసాగనున్న కార్యవర్గం

నవతెలంగాణ - గీసుకొండ

ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్‌ గీసుకొండ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు పసరగొండ రమేష్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అసోసియేషన్‌ నూతన కమిటీని ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నుకుంటారు.

మండల అధ్యక్షుడిగా ముండ్రాతి కైలాసం, కార్యదర్శిగా బిట్ల శివప్రసాద్‌, కోశాధికారిగా గజ్జెల్లి రాజేందర్‌, గౌరవాధ్యక్షుడిగా ఊరుకొండ సుధాకర్‌, ఉపాధ్యక్షులుగా అశోక్‌, రాజేందర్‌లను ఎన్నుకున్నారు.


ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్‌ సభ్యుల సమస్యలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మండలంలోని ఆర్‌ఎంపీ, పీఎంపీల మధ్య సమన్వయంతో పనిచేస్తూ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్