Magazines

అదనపు కలెక్టర్‌కు తప్పిన పెను ప్రమాదం

50 నిమిషాల క్రితం

bhadradri-kothagudem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్‌ ధార వేణుగోపాల్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. అదనపు కలెక్టర్‌ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్