నవతెలంగాణ - హైదరాబాద్: నగరంలోని ఈడీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నేతలు ఈ రోజు(సోమవారం) ఆందోళన చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆస్తులపై ఈడీ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఈడీ సోదాలు నిర్వహించినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లేందుకు నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.






కామెంట్‌లు (0)