Magazines

ఆర్‌ఎంపీ, పీఎంపీ ములుగు జిల్లా సెక్రటరీగా పతంగి నాగరాజు ఏకగ్రీవం

7 గంటల క్రితం

Rmp
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కన్నాయిగూడెం

ములుగు జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ఎన్ హరిబాబు ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పంతంగి నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ..తన ఎన్నికకు సహకరించిన తోటి ఆర్ఎంపీ, పీఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందించే ఆర్ఎంపీలపై కక్ష‍్య సాధింపుగా దాడులు జరుపుతున్నారని, అమాయక గ్రామీణ వైద్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆర్ఎంపీలు పడుతున్న ఇబ్బందులపై పోరాటానికి నా వంతు కృషి చేస్తారని చెప్పారు. ఆర్ఎంపీ లను గుర్తించి, శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేలా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్