Magazines

యూపీని ముంచెత్తిన భారీ వర్షాలు

45 నిమిషాల క్రితం

Heavy rains inundate UP
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

జనజీవనం అస్తవ్యస్తం..56 మంది మృతి, 46 మందికి గాయాలు

63 జిల్లాల్లో అధిక వర్షపాతం


లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు విరుచుకు పడటంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్ష సంబంధిత ఘటనల్లో 56 మంది మరణించగా, 46 మంది గాయపడ్డారు. 117 ఇండ్లు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మొత్తం 63 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో సాధారణం కంటే 19 రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో మట్టి గోడలు కూలి ఐదుగురు మరణించగా, చెట్లు కూలి మరో ఐదుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. లఖింపూర్ ఖేరి, అమేథీ, బారాబంకి , గోరఖ్‌పూర్‌లలో ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందాయి. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రంతా వర్షాలు కొనసాగడంతో లోతట్టు ప్రాంతాల నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఉదయం చాలా రోడ్లు నీటితో నిండిపోయాయి. అనేక చోట్ల రాకపోకలు కష్టంగా మారాయి," అని స్థానిక నివాసి ప్రవీణ్ సింగ్ అన్నారు. వర్షంతో పాటు వీచిన బలమైన గాలులు కూడా అంతరాయాన్ని మరింత పెంచాయి, దీంతో ప్రజలు అనేక చోట్ల తలదాచుకున్నారు.అయోధ్యలోనూ వర్షం , బలమైన గాలుల కారణంగా రామ్ పాత్, రామ మందిరం, హనుమాన్‌గఢి, కనక్ భవన్ , సరయూ ప్రాంతాల చుట్టూ రాకపోకలకు అంతరాయం కలిగింది."వర్షం, గాలులు ఇలాగే కొనసాగితే, మరిన్ని పంటలు నేలకూలవచ్చు, నష్టాలు మరింత పెరుగుతాయి," అని హర్దోయ్‌కు చెందిన రైతు ప్రమోద్ కుమార్ అన్నారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన అల్పపీడనం, వాయువ్య దిశగా ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వైపు కదులుతోంది. శనివారం ఉదయం 5.30 గంటలకు, ఇది ప్రయాగ్‌రాజ్‌కు దక్షిణంగా సుమారు 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మధ్య టెరాయ్ ప్రాంతంలో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో మధ్య, టెరాయ్ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని పరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల వల్ల తేలికపాటి నుంచి మధ్యస్థ ప్రమాదం పొంచి ఉందని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్