ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవనంలో వయసుతో భేదం లేకుండా ఎంతో మంది అనారోగ్యం బారినపడుతున్నారు. యువత సైతం దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం అవుతున్నారు. కానీ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే చక్కటి జీవన శైలితో సాధ్యమవుతుంది. జీవన విధానంపై అవగాహన పెంచుకొని అడుగేస్తేనే ఆరోగ్యానికి పూలబాట వేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
నిత్యం అరగంట వ్యాయామం తప్పనిసరి : నిత్యం అరగంట వ్యాయామం చేయడం తప్పనిసరి. వారంలో మొత్తంగా 4-6 గంటల సమయం ఇందుకు కేటాయించాలి. వ్యాయామం, యోగా లేదంటే క్రీడల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలను ఏదో ఒక ఆటవైపు మళ్లించాలి. ఇందుకు మైదానం చక్కటి వేదిక కావాలి.
మానసిక ఆరోగ్యం ముఖ్యం : సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలంటే మానసిక ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యం. ఆందోళనలు వేధిస్తే మానసిక వైద్యులను సంప్రదించాలి.
తాగునీటి పాత్ర ఎంతో కీలకం : రోజులో సాధారణం కంటే ఒక వ్యక్తి వేసవిలో మరో 2 లీటర్లు పెంచాలి. మూత్రం లేత పసుపు రంగులో వస్తుందంటే నీటి శాతం తగ్గిందని తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా నీటి స్థాయిని పెంచాలి. అంటే ఎక్కువగా నీటిని తాగాలి.
6-8 గంటల నిద్ర : రోజులో కనీసం 6-8 గంటలు నిద్రపోవాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఫోన్ ఇతర డిజిటల్ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి. రాత్రి 8 గంటల తర్వాత అత్యవసరమైతేనే స్క్రీన్లను వినియోగించాలి. ఎక్కువగా స్క్రీన్లను చూడటం వల్ల నిద్ర సమయం తగ్గిపోతుంది. కంటి మీద భారం పడి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
స్వచ్ఛమైన ఆహారం : సంపూర్ణ ఆరోగ్యం కావాలనుకునే వారికి స్వచ్ఛమైన ఆహారం ముఖ్యం. ఎలాంటి రసాయనాలు వాడని, సేంద్రీయ ఆహార పదార్థాలనే తినాలి. బయట నుంచి తీసుకొచ్చిన కూరగాయలు, పండ్లను కడుక్కొని తినాలి. ఇలా చేయడం వల్ల కొంతైనా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నవాళ్లమి అవుతాం.
ఆరోగ్యకరమైన జీవితానికి....
5 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)