డేటా సెంటర్లకు ఎల్నినో భయాలు
వర్షాల్లేక అల్లాడుతున్న దేశం
డేటా సెంటర్లు పూర్తిగా ఏర్పాటైతే ఎదురయ్యే పరిస్థితులపై ఆందోళనలు
పెట్టుబడుల పేరుతో తెలంగాణలో వాటికి రెడ్కార్పెట్
భారీగా విద్యుత్, నీటి వినియోగం.. సామాన్యులకు కష్టాలే!
ప్రకృతితో మమేకమై, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనిషికి భూమి మీద మనుగడ. దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఏమౌతుందో ఈ ఏడాది ఎల్నినో రూపంలో వచ్చిన విపత్తు ప్రత్యక్ష ఉదాహరణ. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు ముందు వెనుక ఆలోచించకుండా ప్రకృతికి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటే, ఆ తర్వాత కష్టాలపాలయ్యేది సామాన్య ప్రజానీకమే. రాష్ట్రంలో మొత్తంగా 14,300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల స్థాపన చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీటిలో 300 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మాణం పూర్తయ్యి పనిచేస్తుంది. మరో 2వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల పనులు వేర్వేరు స్టేజీల్లో ఉన్నాయి. మరో 12వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు ఈ సెంటర్లకు విద్యుత్, నీటి సౌకార్యాలు కల్పించడమే. వీటిలో అనేక కంపెనీలకు ఇప్పటికే వందల ఎకరాల భూములు కేటాయించారు. కొన్ని పరిశీలన దశలో ఉన్నాయి.
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
రాష్ట్రంలో 14,300 మెగావాట్ల సామర్థ్యం ఉండే డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. 1,000 మెగావాట్లకు రోజుకు దాదాపు 24 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. అంటే 14,300 మెగావాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వాటికోసమే రోజువారీ కావల్సిన విద్యుత్ దాదాపు 18,590 మెగావాట్లు. అంటే రోజుకు 446.16 మిలియన్ యూనిట్లు కావాలి. ఏడాదికి దాదాపు 1,62,848 మిలియన్ యూనిట్లు అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఈనెల 9న రికార్డు అయ్యింది. ఆ ఒక్కరోజే రాష్ట్రంలో 19,543 మెగావాట్లు నమోదైంది. అంటే ఇప్పుడున్న విద్యుత్ డిమాండ్కు దాదాపు సమాంతరంగా డేటా సెంటర్లకు కరెంటును అందించాలి. దీనికో సం భారీ పెట్టుబడులు, విద్యుదుత్పత్తి కేంద్రా ల నిర్మాణం, ట్రాన్స్కో లైన్ల నిర్మాణం సహా అనేక ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. అన్నింటికంటే మించి ఆయా డేటా సెంటర్లకు వందల ఎకరాల భూములు కేటాయించాలి. చెట్లను కొట్టేయాలి. కొండలు, గుట్టల్ని సమం చేయాలి. అంటే అభివృద్ధి కోసం ప్రకృతి విధ్వంసాన్ని చేపట్టాలి. ఇంతా చేస్తే ఆయా ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా లభించే ఉద్యోగాలు దాదాపు 10 వేల నుంచి 12వేల లోపే.
నీటి కష్టాలు
ఈ విధ్వంసం ఇక్కడితో ఆగట్లేదు. డేటా సెంటర్లకు నీటి వినియోగం మరో కీలకాంశం. డేటా సెంటర్లలో సర్వర్ల నుంచి వెలువడే అధిక ఉష్ణాన్ని తొలగించడానికి కూలింగ్ వ్యవస్థలు కీలకం. సంప్రదాయ కూలింగ్ విధానాలతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లలో అధిక సాంద్రత కలిగిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి
సాంకేతికతలు అవసరమవుతున్నాయి. 14,300 డేటా సెంటర్లు 24 గంటలు పనిచేస్తే వాటి కూలింగ్ వ్యవస్థలకు రోజుకు దాదాపు 9.27 కోట్ల లీటర్ల నీరు అవసరం. అంటే ఏడాదికి దాదాపు 3,382 కోట్ల లీటర్లు అవసరం అవుతాయి. అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాటర్బోర్డు నీటి సరఫరా డిమాండ్ రోజుకు దాదాపు 274.4 కోట్ల లీటర్లు. దానిలో రోజుకు దాదాపు 79 కోట్ల లీటర్ల నీటి కొరత ఏర్పడుతున్నది. ఈ పరిస్థితుల్లో డేటాసెంటర్లకు నీటిని ఎక్కడినుంచి ఎలా సమకూరుస్తారనేది ప్రధాన ప్రశ్న.
సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీనికి రూ.5 వేల కోట్ల పెట్టుబడి, విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా 100 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును కూడా ప్రతిపాదించారు.
ఇవీ ఒప్పందాలు
-టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ హైదరాబాద్లో గరిష్ఠంగా 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 264 ఎకరాల్లో దశలవారీగా దీన్ని అభివఅద్ధి చేస్తారు. హైపర్వాల్ట్, భాగస్వామ్య సంస్థలు గరిష్ఠంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రకటించింది. ఈ ఒక్క యూనిట్కే సంవత్సరానికి దాదాపు 8,760 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా. - కంట్రోలఎస్ డేటాసెంటర్స్తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 400 మెగవాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. - అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా హైదరాబాద్లో డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణకు రూ.60 వేల కోట్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. 2030 నాటికి వీటిని పట్టాలెక్కిస్తామని తెలిపింది. - మైక్రోసాఫ్ట్ సంస్థ 600మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. పూర్తి సామర్థ్యంతో ఏడాది పొడవునా ఇది నడిస్తే దాదాపు 5,256 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా. - కంట్రోల్ ఎస్ సంస్థ హైదరాబాద్ సమీపంలోని చందన్వెల్లి వద్ద మరో డేటా సెంటర్ పార్క్ను ప్రతిపాదించింది. దాని పూర్తి అభివఅద్ధి సామర్థ్యం 600 మెగావాట్లకు పైగా ఉంటుందని ప్రకటించింది. - అదానీ కనెక్స్ సంస్థ చందన్వెల్లిలో 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్కు రూ.5 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. - అరుం ఈక్విటీ పార్టనర్స్ సంస్థ హైదరాబాద్లో దశలవారీగా 100 మెగావాట్ల ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం దాదాపు రూ.3,850 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. - ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ సంస్థ ఫ్యూచర్ సిటీలో మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ-రెడీ డేటా సెంటర్ క్యాంపస్కు రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఒప్పందం చేసుకుంది. - యూపీసీ రెనవబుల్స్ ఓల్ట్ డేటా సెంటర్స్ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా
కూల్డ్రింక్స్, వాటర్ బాటిళ్లకే...
ఇప్పటికే రాష్ట్రంలో కూల్డ్రింక్స్, వాటర్ బాటిళ్లు తయారు చేసే కార్పొరేట్ సంస్థలకు వాటర్బోర్డు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నది. వారికి సరఫరా చేశాకే, మిగిలిన నీటిని ప్రజలకు ఇస్తున్నారు. సమీప భవిష్యత్లో డేటా సెంటర్లకు కూడా ఇదే తరహా కేటాయింపులు జరిగితే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటనేది ఆందోళనకరం.
మళ్లీ అక్కడే పెట్టుబడులు?
ఈ ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ను నిర్వహిస్తున్నది. ఈసారి కూడా డేటా సెంటర్ల ఏర్పాట్లకే ఒప్పందాలు జరిగే సూచనలున్నాయి. ఆ సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తున్నదని తాగు, సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు.
ఒక్క ఏడాదికే కుదేలు
కేవలం ఒక్క ఏడాది ఎల్నినో ప్రభావం చూపితేనే రాష్ట్రంలో కరెంటు, సాగు, తాగు నీటికి కటకట ఏర్పడింది. పొరుగు రాష్ట్రాలను నీరు విడుదల చేయమని అభ్యర్థించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయం సహా పారిశ్రమలకూ కరెంటు, నీరు అత్యవసరం. వీటికి ప్రత్యామ్నాయం చూపకుండా కేవలం పెట్టుబడుల కోసం డేటా సెంటర్ల ఏర్పాటుకు అడ్డగోలు అనుమతులు ఇస్తే, రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయా రంగాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.







కామెంట్లు (0)