హీరో విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ నారాయణరావు కొండ్రొల్లా జేబీ మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో వెటరన్ నటి జరీనా వహాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రను జుబైదాగా మేకర్స్ పరిచయం చేశారు. ప్రేమతో కూడిన హృదయం.. పోరాటాలతో నిండిన జీవితం అంటూ రివీల్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్, నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జెబి నారాయణ్ రావు కొండ్రోళ్ల, సమర్పణ: ఛార్మీ కౌర్, సీఇఓ : విష్ణు రెడ్డి, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, డీఓపీ : సామ్ కె నాయుడు, ఎడిటింగ్: సంతోష్ నూజిళ్ల.
జుబైదాగా జరీనా వహాబ్ కీలక పాత్ర
3 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)