నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దేశ ద్రోహీ అంటూ సీజేపీ నేతలు విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ(SIR)లో భారీ అవకతవకలను నిరసిస్తూ ఈసీకి వ్యతిరేకంగా భారీ నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గాంధీ జయంతి రోజున మహారాష్ట్రలోని ముంబాయి వేదికగా ర్యాలీ తీశారు. దేశద్రోహి అయిన CEC జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే ఆ బాద్యతల నుంచి తొలగించాలని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు.
"మేము ఈ రోజు ముంబై నుంచే దీనిని ప్రారంభిస్తున్నాము. ఇది చాలా పెద్ద నిరసనగా మారబోతోంది. ముంబై స్ఫూర్తి ఏమిటో గతంలోనే ముంబై ప్రజలు నిరూపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం గతంలో దేశవ్యాప్తంగా యువత, యువ తరాలు అన్నీ ఏకమై బయటకు వచ్చాయి. ఇప్పుడు దేశద్రోహి అయిన జ్ఞానేష్ కుమార్ విషయంలోనూ అదే జరగబోతోంది. యువత మరోసారి వీధుల్లోకి వస్తున్నారు" అని ఆయన అన్నారు.





కామెంట్‌లు (0)