నవతెలంగాణ-హైదరాబాద్ : ఫ్లై-దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో వీరోచితంగా పోరాడి గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్తో శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాక్పిట్లో తనకు ఎదురైన అత్యవసర పరిస్థితి గురించి స్మిత్ ప్రధానికి వివరించారు. విపత్కర పరిస్థితుల్లో ఆయన చూపిన ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.






కామెంట్లు (0)