Magazines

జంతర్ మంతర్ వద్ద SFI, DYFI భారీ ఆందోళన

1 గంట క్రితం

dyfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) సభ్యులు శుక్రవారం జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఈ నిరసనలకు మద్దతుగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పాల్గొన్నారు. ఎన్నికల సంఘం పనితీరుకు సంబంధించిన నిబంధనలను కుమార్ ఉల్లంఘించారని మండిపడ్డారు. ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. "ప్రజల ఓట్లను చీల్చే నేరపూరిత చర్యకు పాల్పడినందుకు జ్ఞానేష్ కుమార్‌ను అరెస్టు చేయాలి,ఎన్నికల సంఘానికి సంబంధించిన అన్ని నిబంధనలను కుమార్ బరితెగించి ఉల్లంఘిస్తున్నారని, "ఆయన రాజీనామా చేయడం లేదు కాబట్టి, ఆయనను తొలగించాలి, ఆయనను తప్పక తొలగించాలి. ఆయనను తొలగించే వరకు, విద్యార్థి యువజన ఉద్యమం కొనసాగుతుంది," అని బేబీ అన్నారు.


అంతకముందు ఈ నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించి, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), 2023లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించినప్పటికీ ఈ నిరసన జరిగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది యవతీ, యువకులు, విద్యార్థి నాయకులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. ఈ నిరసనల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్