Magazines

తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు స్పష్టత

1 గంట క్రితం

supreme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. స్థానిక రిజర్వేషన్‌కు నాలుగేళ్ల నియమం తప్పనిసరి అని పేర్కొంది. ఈవిషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. దీనిపై గతంలో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునరుద్ఘాటించింది. స్థానికత అంశంపై బెల్లం అంకిత వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ నిబంధన ఏకపక్షంగా ఉందన్న వాదనను జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ధర్మాసనం కొట్టివేసింది. తెలంగాణలో విద్యాభ్యాసం చేస్తేనే స్థానికత వర్తిస్తుందని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్