నవతెలంగాణ - హైదరాబాద్ : నవజాత శిశువులకు బంగారు ఉంగరం అందించే ‘తాయ్ మామన్ తంగ మోతిరం’ పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సోమవారం మదురైలో ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే అర్హులైన శిశువులకు ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారు ఉంగరం అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పథకం అమలు కానుంది. పిఐసిఎంఇలో నమోదు చేసుకుని ఆర్సీహెచ్ ఐడీ పొందిన తమిళనాడు శాశ్వత నివాసితుల పిల్లలు అర్హులు. పథకం ప్రారంభం నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు డిశ్చార్జి సమయంలోనే ఉంగరం అందజేస్తారు. సురక్షిత సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి-బిడ్డల సంక్షేమాన్ని బలోపేతం చేయడం పథకం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.






కామెంట్లు (0)