Magazines

ఆటో-లారీ ఢీ.. ఇద్దరు మృతి

1 గంట క్రితం

Auto-lorry collision
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ - హైదరాబాద్‌: లారీ-ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెంది, మరో ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన మంచిర్యాల జిల్లాలోని నూస్పూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రోజువారీ కూలీలు ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులను మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన లక్ష‍్మీ, లేమూరు వెంకటాపూర్‌కు చెందిన అగ్గు సౌందర్యగా గుర్తించారు. క్ష‍తగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్