లూలా, ఫ్లావియా
బోల్సనారో మధ్య తీవ్ర పోటీ
రియో డీ జనైరో : బ్రెజిల్‌లో ఆదివారం జరిగే అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం తాను ఓడించిన జైర్ బోల్సనారో కుమారుడైన ఫ్లావియా బోల్సనారోతో దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో డ సిల్వా తలపడుతున్నారు. రాజకీయ కుట్రకు పాల్పడిన నేరంపై జైర్ బోల్సనారో ప్రస్తుతం 27 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని స్వీకరించిన ఫ్లావియా ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. తాను ఎన్నికైతే తండ్రికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని ఫ్లావియా హామీ ఇచ్చారు. మరోవైపు 80 సంవత్సరాల లూలా నాలుగోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. బ్రెజిల్‌లో లూలా నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం కొనసాగు తుందా లేక బోల్సనారో ఉద్యమం విజయం సాధిస్తుందా అన్నది ఈ ఎన్నికలలో తేలుతుంది. బ్రెజిల్ అధ్యక్షుడుగా ఎన్నికైన వ్యక్తి 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో నలుగురిని నియమిస్తారు. కాబట్టి విజేతకు రాబోయే సంవత్సరాలో న్యాయస్థానంపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. కాగా ఫెడరల్, రాష్ట్ర శాసనసభ స్థానాలు, రాష్ట్రాల గవర్నర్ పదవులకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్ష లేదా గవర్నర్ అభ్యర్థులలో ఎవరికీ యాభై శాతం ఓట్లు లభించకపోతే అత్యధిక ఓట్లు పొందిన ఇద్దరు అభ్యర్థులు ఈ నెల 25న జరిగే రన్‌ఆఫ్‌కు వెళతారు. ఈవీఎంల వినియోగం కారణంగా ఆదివారం రాత్రికే ఫలితాల సరళి తెలుస్తుంది.
నేడు బ్రెజిల్‌లో ఎన్నికలు
46 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)