Magazines

ఆస్పత్రుల నిర్మాణాల్లో వేగం పెంచాలి

40 నిమిషాల క్రితం

The pace of hospital construction needs to be accelerated.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 2 నిమిషాల చదవడం


సీజనల్‌ ‌వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశం
డిసెంబర్‌‌లో భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీలో తెలంగాణ గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ఏర్పాట్లపై చర్చ
పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మా నియా ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్‌‌రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులకు సీఎం పలు కీలక సూచనలు చేశారు. శనివారం సీఎంవో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆస్పత్రుల నిర్మాణం, పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను మొదలు పెట్టాలని, ఆస్పత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో అవసరమైన అత్యాధునిక పరికారాలను కొనుగోలు చేసి, వాటి నిర్మాణం పూర్తయ్యే నాటికి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులూ క్షేత్రస్థాయి లో ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, ఆస్పత్రులను సందర్శించాల్సిందేనని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లాకు సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతీ వారం వీటిపై సమీక్ష నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపైనా సమావేశంలో అధికారులతో చర్చించారు. సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడుల విషయంలో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. త్వరలోనే ఏర్పాట్లను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్