Magazines

‌వికారాబాద్‌ ఘటన బాధాకరం

51 నిమిషాల క్రితం

బస్సు ప్రమాదం
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
వికారాబాద్‌ జిల్లా అనంతగిరి ఘాట్‌ రోడ్డులో జరిగిన ప్రయివేటు బస్సు ప్రమాదంలో నలుగురు మరణించడం, మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిన తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలనీ, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. ఇటీవల తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి రవాణా శాఖ అధికారులు ప్రమాదకరమైన మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డుకిరువైపులా పటిష్టమైన రక్షణ గోడలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్