యూరప్ దేశాలకు పుతిన్ వార్నింగ్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరప్ దేశాలకు కీలక హెచ్చరిక చేశారు. యూరప్‌తో ఎలాంటి ఉద్రిక్తతలు పెరిగినా ఎవరూ విజేతలుగా ఉండరని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో బాల్టిక్ సముద్రం మీదుగా జరుగుతున్న నౌకాయానంపై ఆంక్షలు విధించవద్దని యూరప్ దేశాలను హెచ్చరించారు. మాస్కో యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. కానీ ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బాల్టిక్ సముద్రంలో నౌకాయానంపై ఆంక్షలను రష్యా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. సముద్ర రవాణాకు ఆటంకం కలిగితే హర్మూజ్ జలసంధిలో ఉన్న పరిస్థితే తలెత్తుతుందని అన్నారు. ఆఫ్రికా నాయకులతో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశం అనంతరం పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'మేము యూరప్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు'
"పర్షియన్ గల్ఫ్ లేదా హర్మూజ్ జలసంధిలో ఉన్నటువంటి పరిస్థితే బాల్టిక్ సముద్రంలో కూడా రావా లని ఎవరైనా కోరుకుంటున్నారా? బాల్టిక్ సముంద్రంలో అలాంటి పరిస్థితిని రష్యా కోరుకోవడం లేదు. బాల్టిక్ సముద్రంలో నౌకాయానంపై ఆంక్షలను రష్యా వ్యతిరేకిస్తుంది. యూరప్‌తో యుద్ధం జరిగితే అందు కు రష్యా సిద్ధంగానే ఉంది. అయితే తాము అలాంటి సంఘర్షణను కోరు కోవడంలేదు. ఘర్షణకు దిగే ఏ దేశ మైనా దాని పర్యవసానాలకు సిద్ధం గా ఉండాలి. ఉద్రిక్తతలు మితిమీరి పెరిగితే ఎవరూ విజేతలుగా ఉండ రు. అదే సమయంలో విస్తృత సంఘ ర్షణ ప్రమాదాలను విస్మరించవద్దు" అని పుతిన్ పేర్కొన్నారు.
కాగా, పుతిన్ ఆఫ్రికా నాయకు లతో శిఖరాగ్ర సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో ఫిన్లాండ్, నార్వేలతో ఇటీవల కుదిరిన దౌత్య సంబంధాల గురించి చర్చించారు. మాస్కో, పాశ్చాత్య దేశాల మధ్య ఘర్షణలు పెరుగుతున్నప్పటికీ, యూరప్ దేశాలతో సంబంధాలను పునరుద్ధరించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఈ వారం ప్రారంభంలో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్లతో పుతిన్ టెలిఫోన్ సంభాషణ జరిపారు. మాస్కోతో సంబంధాలపై ఆ ఇరు దేశాధినేతలు తీసుకున్న నిర్ణయంపై కొన్ని యూరప్ దేశాలు మండిపడ్డాయి. తీవ్ర విమర్శలకు దిగాయి.
యుద్ధంలో రష్యాను ఓడించడం అసాధ్యం : పుతిన్
కొద్ది రోజుల క్రితం కూడా యూరప్ దేశాల గురించి పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రష్యాను ఓడించడం సాధ్యం కాదన్నారు. తమ దేశంతో యుద్ధం వస్తుందంటూ యూరప్ దేశాలు చేస్తున్న ప్రచారం వారి రాజకీయ మానసిక అస్థిరతను చూపిస్తోందని విమర్శించారు. రష్యాతో యుద్ధానికి సిద్ధం కావాలంటూ యూరప్ దేశాలు చేస్తున్న ప్రకటనలను ఖండించారు. మరోవైపు, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి పరిష్కారం కనుగొనేందుకు చర్చల మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అమెరికా మధ్యవర్తిత్వంలో యుద్ధం గురించి ఉక్రెయిన్‌తో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించినట్లు స్పష్టం చేశారు.







కామెంట్లు (0)