Magazines

భారత్, పాక్ వేర్వేరు గ్రూపుల్లో..

4 గంటల క్రితం

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

ఐసీసీ టీ 20 (అండర్‌-19) మహిళల

ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసిసి) మహిళల (అండర్‌-19) టి20 ప్రపంచకప్‌ 2027 షెడ్యూల్‌ విడుదలయ్యింది. 2027 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్‌, నేపాల్‌ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఆసియాఖండ ఫేవరెట్‌ జట్లు భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో పోటీ పడను న్నాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు 41 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. టీమిండియా జనవరి 22న వెస్టిండీస్ మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించనుంది. ఆ తర్వాత జనవరి 24న నేపాల్‌తో, జనవరి 26న ఐర్లాండ్‌తో తలపడనుంది. మరోవైపు జనవరి 22న పాకిస్థాన్‌ తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. జనవరి 24న న్యూజిలాండ్‌తో, జనవరి 26న సమోవాను ఢీకొట్టనుంది.గ్రూప్‌ దశ మ్యాచ్‌లు జనవరి 26తో ముగుస్తాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-6కు చేరుకుంటాయి. సూపర్‌-6 రెండు గ్రూపుల్లో ఉండగా.. సూపర్‌-6లో రెండు గ్రూపుల్లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 4న చటోగ్రామ్‌లో సెమీఫైనల్స్‌, 6న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఫిబ్రవరి 7న రిజర్వ్‌ డే కేటాయించారు. అలానే వచ్చే ఏడాది పురుషుల వన్డే ప్రపంచ కప్ కూడా జరగనుంది. దక్ష‍ిణాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్