పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు
62 పతకాలతో నాల్గో స్థానానికి...
నగోయా(జపాన్): 5వ ఆసియా పారా క్రీడల్లో భారత్ పత కాల పంట పండిస్తోంది. తొలి రోజు 11, రెండోరోజు 24 పతకాలు దక్కగా మూడోరోజు మరో 19పతకాలు దక్కాయి. దీంతో క్రీడల మూడోరోజు పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో దాదాపు 54 పతకాలు జమ య్యాయి. బుధవారం 100మీ. టి12 ఈవెంట్‌లో సిమ్రన్ శర్మ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పరుగును సిమ్రన్ కేవలం 12.02 సెకన్లలో ఫినిష్ చేసింది. ఈ క్రీడల్లో సిమ్రన్‌కు ఇది రెండో స్వర్ణ పతకం. మంగళవారం 200మీ. టి12 స్ప్రింట్ ఈవెంట్‌లోనూ సిమ్రన్‌కు స్వర్ణం దక్కింది. పారిస్‌లో జరిగిన పారా ఒలింపిక్స్‌లో 100మీ. ఈవెంట్‌లో స్ప్రింటర్ సిమ్రన్ శర్మ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇరానీ అథ్లెట్ 12.30 సెకన్లలో, ఇండోనేషి యాకు చెందిన నీ పుత్రి 12.51 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. 2023లో హాంగ్జౌలో జరిగిన ఆసియా పారా క్రీడల్లోనూ సిమ్రన్ రెండు ఈవెంట్లలోనూ రజత పతకాలు గెలిచింది. ఇక పురుషుల టి47 విభాగంలో 100 మీటర్ల స్ప్రింట్ పోటీలో భారత అథ్లెట్ దిలీప్ స్వర్ణం సాధించాడు. అలాగే పురుషుల 400 మీటర్ల టీ35/38 ఈవెంట్‌లో భారత అథ్లెట్ అకీరా నందన్ బానోతు 51.25 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచి రజతం సాధించారు. జావెలిన్ త్రో ఎఫ్-53/54 విభాగంలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. పురుషుల 100 మీటర్ల టి-35 పరుగులో అనుభవ్ చౌదరి 12.72 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. ఇది అనుభవ్ కెరీర్‌లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన.
షాట్‌పుట్ పతకాలన్నీ భారత్ ఖాతాలోనే...
పురుషుల పారా షాట్‌పుట్‌లో సచిన్ ఖిలారీ స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. షాట్‌పుట్ ఎఫ్-46 విభాగంలో సచిన్ ఖిలారీ 15.87 మీటర్ల దూరం విసిరి గేమ్స్ రికార్డు నెలకొల్పాడు. ఇదే విభాగంలో భారత్‌కు చెందిన మహ్మద్ యాసర్ (15.06 మీ), పర్వీన్ (14.94 మీ) రజత, కాంస్య పతకాలు సాధించారు. దీంతో భారత్ పోడియంపై మూడు స్థానాలనూ కైవసం చేసుకుంది. పురుషుల షాట్‌పుట్ ఎఫ్-53 విభాగంలో ఆయుష్ వర్మ 8.16 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం గెలిచాడు. అలాగే మహిళల షాట్‌పుట్ ఎఫ్-34 విభాగంలో భారత అథ్లెట్ భాగ్యశ్రీ జాదవ్ 8.19 మీటర్ల దూరం గుండు విసిరి రజతం గెలుచుకుంది.
హైజంప్‌లోనూ స్వర్ణం, రజతం..
పురుషుల హైజంప్ టి-64 విభాగంలో ప్రవీణ్ కుమార్ 2.05 మీటర్ల ఎత్తు దూకి బంగారు పతకం సాధించాడు. పారా ఆసియా క్రీడల రికార్డును కూడా తిరగరాశాడు. ఇదే విభాగంలో భారత్‌కు చెందిన బంటి 1.92 మీటర్లు దూకి రజత పతకం సాధించాడు. దీంతో ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం రెండూ దక్కాయి.
ఆర్చరీలో శీతల్ దేవి, పాయల్ నాగ్‌కు రజతం...
మహిళల కాంపౌండ్ డబుల్స్ ఆర్చరీ ఫైనల్లో భారత జోడీ శీతల్ దేవి, పాయల్ నాగ్ 141-150 స్కోరుతో చైనాకు చెందిన ఝావో జింగ్, జు ష్యూకింగ్ జోడీ చేతిలో ఓటమిపాలై రజత పతకానికే పరిమితమయ్యారు. కాంపౌండ్ ఆర్చరీ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 720 పాయింట్ల కు 704 సాధించి ప్రపంచ రికార్డును సమం చేసిన శీతల్ ఖాతాలో మరో పతకం జమయ్యిం ది. దీంతో 5వ ఆసియా పారా క్రీడల్లో మూడో రోజు పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో 14 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో సహా మొత్తం 62 పతకాలతో భారత్.. పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.







కామెంట్‌లు (0)