Magazines

చోళ చీఫ్స్‌ బోణీ

55 నిమిషాల క్రితం

deepik kumari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

- ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌2

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆర్చరీ ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఏపీఎల్‌) ‌రెండో సీజన్‌‌లో చోళ చీఫ్స్‌ ‌తమిళనాడు జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం హైదరాబాద్‌‌లోని పీపుల్స్‌‌ప్లాజా వేదికగా జరిగిన మ్యాచ్‌‌లో కాకతీయ నైట్స్‌ ‌తెలంగాణ జట్టుపై 6-2తో చోళ చీఫ్స్‌ ‌తమిళనాడు విజయం సాధించింది. చోళ చీఫ్స్‌‌ తరఫున బరిలోకి దిగిన కొలంబియా అలెజాండ్ర ఏపీఎల్‌ అరంగేట్రంలో అదరగొట్టింది. కాంపౌండ్‌ ‌విభాగంలో సంధించిన ఎనిమిది బాణాలు 10 స్కోరు సాధించాయి. తెలంగాణ స్టార్‌ ‌తానిపర్తి చికిత సైతం చోళ చీఫ్స్‌‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా.. కాకతీయ నైట్స్‌‌తో మ్యాచ్‌‌కు రిజర్వ్‌ ‌ప్లేయర్‌‌గానే నిలిచింది. చోళ చీఫ్స్‌ ‌కాంపౌండ్‌ ఆర్చర్లు రిషబ్‌ ‌యాదవ్‌, అలెజాండ్ర.. రికర్వ్‌ ఆర్చర్లు మార్కస్‌, దీపికా కుమారిలు నాలుగు సెట్లలోనూ గురి తప్పలేదు. ఫర్‌‌ఫెక్ట్‌ 10 ‌పాయింట్ల బాణాలతో చోళ చీఫ్స్‌‌ను గెలుపు బాటలో నడిపించారు. సీజన్‌2లో రెండు మ్యాచ్‌‌ల్లో చోళ చీఫ్స్‌‌కు ఇది తొలి గెలుపు కాగా.. రెండు మ్యాచ్‌‌ల్లో కాకతీయ నైట్స్‌‌కు ఇది తొలి ఓటమి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్