Magazines

ఈ 'అలియాస్ రుక్మిణి' కథేంటి?

57 నిమిషాల క్రితం

nitin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకురాబోతున్నారు. 'అలియాస్ రుక్మిణి' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. శరవేగంగా షూటింగ్ జరుగుతుండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ రిలీజ్‌కు డిసెంబర్ 4వ తేదీని ఖరారు చేశారు. కృష్ణ అనే కథానాయకుడు సాధారణమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే కొన్ని నిజాలను బయటపెట్టకుండా ఉండటమే మంచిదనే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో అతడి జీవితంలోకి ప్రేమ ప్రవేశిస్తుంది. అనుకోకుండా బయటపడిన ఓ రహస్యం అతను నమ్మిన ప్రతిదాన్నీ తలకిందులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ, దాగి ఉన్న నిజాల చుట్టూ సాగే ఈ కథ.. సమాజం అంగీకరించే విషయాలకు, ప్రశ్నించాలనుకునే అంశాలకు మధ్య ఉన్న సన్నని గీతను ఆవిష్కరించనుంది. త్వరలోనే తొలి పాటను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు అని చిత్ర బృందం తెలిపింది. నితిన్, సాయి కుమార్, హర్ష వర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రచన, దర్శకత్వం: మురళీ కాంత్ దేవసోత్, నిర్మాత: దీప్తి గంటా, సినిమాటోగ్రఫీ: జోమోన్ టి. జాన్, సంగీతం: విజయ్ బుల్గానిన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎడిటర్: సృజన అడుసుమిల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్