నవతెలంగాణ- హైదరాబాద్: టెర్మినస్ సెంటర్ కోర్ట్ పికిల్ బాల్ లీగ్ (సీసీపీఎల్) రెండో సీజన్ పోటీలు ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. లీగ్ లో ఎనిమిది జట్లు, 80 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ సీజన్ కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో 200 మంది పేర్లను నమోదు చేసుకోగా, 53 మంది పురుషులు, 27 మంది మహిళా ప్లేయర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. డిసెంబర్ 5 నుంచి ప్లేఆఫ్స్ ఆరంభం కానుండగా, 12 న ఫైనల్ జరుగుతుంది. ఈ మేరకు సెంటర్ కోర్ట్ సహా వ్యవస్థాపకులు విక్రమ్ రావు, యశ్వంత్ బియ్యాల తెలిపారు. ఈ లీగ్ లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, తరుణ్ భాస్కర్, సుశాంత్ ఫ్రాంచైజీలు కలిగి ఉన్నారు.







కామెంట్లు (0)