Magazines

ట్రావిశ్‌ ‌హెడ్‌ అవుట్‌

1 గంట క్రితం

Travis
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

విధ్వంసక ఓపెనర్‌‌ను వదిలేసిన సన్‌‌రైజర్స్‌

హైదరాబాద్‌ : సన్‌‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌ ‌స్టార్‌ ‌బ్యాటర్‌ ‌ట్రావిశ్‌ ‌హెడ్‌‌ను వదిలిపెట్టింది. ఆస్ర్టేలియా కెప్టెన్‌ ‌పాట్‌ ‌కమిన్స్‌ ఆరెంజ్ ఆర్మీతో పాటు కొనసాగుతున్నా.. పని భారం సమతుల్యత కోసం ట్రావిశ్‌ ‌హెడ్‌ 2027 ఐపీఎల్‌‌లో ఆడటం లేదు. రూ.14 కోట్లకు సన్‌‌రైజర్స్‌‌కు ఆడిన హెడ్‌.. 20వ సీజన్‌‌ వేలంలో అందుబాటులో ఉండటం లేదు. ఆసీస్‌ ‌పేసర్‌ మిచెల్‌ ‌స్టార్క్‌ను సైతం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇదే కారణంతో వదిలేసింది. షిమ్రోన్‌ ‌హెట్‌‌మయర్‌‌ను లక్నో సూపర్‌‌జెయింట్స్‌, ట్రెంట్‌ ‌బౌల్ట్‌‌ను ముంబయి ఇండియన్స్‌‌లు వేలంలోకి విడిచిపెట్టాయి. రూ.14.5 కోట్లతో కొనుగోలు చేసిన ఆల్‌‌రౌండర్‌ ‌ప్రశాంత్‌ ‌వీర్‌‌ను చెన్నై సూపర్‌‌కింగ్స్‌ ‌వదులుకుంది. ఐపీఎల్‌ 2027 మినీ ఆటగాళ్ల వేలం డిసెంబర్‌ 16‌న గోవాలో జరుగనుంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను పది ప్రాంఛైజీలు ఐపీఎల్‌ ‌గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌కు పంపించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్