మంత్రి నిర్మలా సీతారామన్
మ్యూనిచ్ : భారత్–అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పంద చర్చలు స్తబ్దతకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఇరు దేశాలు కీలక అంశాలపై చర్చించాయన్నారు. అయితే ఇకపై పరస్పరం కొత్త రాయితీలు ఇవ్వడం లేదా అదనపు అంశాలను అంగీకరించడం చాలా కష్టమని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన చర్చలు అత్యంత కఠినమైనవిగా ఉన్నాయని.. ప్రస్తుతం చర్చలు స్థబ్దత దశకు చేరుకున్నాయని మ్యూనిచ్ భద్రతా సదస్సులో మంత్రి పేర్కొన్నారు. అమెరికా ప్రధానంగా భారత్‌తో ఉన్న వాణిజ్య లోటును తగ్గించడంపై దృష్టి పెడుతోందని సీతారామన్ తెలిపారు. ఇందుకోసం సుంకాలు, భారత మార్కెట్‌లో సులభంగా ప్రవేశించడం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. అధికారిక వాణిజ్య చర్చలతో పాటు వాణిజ్య అంతరాలను తగ్గించేందుకు అమెరికా ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తోందని ఆమె వెల్లడించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారిందన్నారు. భారత్- అమెరికా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో 2025 ఫిబ్రవరిలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం అధికారిక చర్చలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
భారత్–అమెరికా వాణిజ్య చర్చల్లో స్తబ్దత
42 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)