నవతెలంగాణ-హైదరాబాద్ : రోగ ఫలితాలను మరియు జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ మరియు చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి.
కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు మరియు పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ హాస్పిటల్ భారతదేశము మరియు దక్షిణాసియాలలో ఈ విధమైన అధునాతన చికిత్స అందిస్తున్న మొట్టమొదటి మరియు ఏకైక కేంద్రము.
TULSA-PRO® అనేది ప్రోస్టేట్ కణజాలాన్ని ఖచ్ఛితంగా తొలగించడానికి రూపొందించబడిన ఒక అధునాతన, MRI-గైడెడ్, రేడియేషన్-రహిత మరియు కోత-లేని సాంకేతికత. ఇది ఎలాంటి కోతలు-లేని, ఇబ్బంది-కలిగించని, అనుగుణమైన మరియు నిర్దిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స. ఈ విధానము వాస్తవ సమయములో వైద్యులు ప్రోస్టేట్ మరియు పరిసర అవయవాలను చూడటానికి, చికిత్స అందించవలసిన ప్రదేశాన్ని ఖచ్ఛితంగా లక్ష్యంగా చేసుకొనుటకు మరియు చికిత్స ప్రక్రియను పర్యవేక్షించటానికి అవకాశం కలిగిస్తుంది. చుట్టుపక్కల ఉన్న ప్రభావితంకాని అవయవాలను పరిరక్షిస్తూ గుర్తించబడిన ప్రాణాంతకమైన ప్రోస్టేట్ కణజాలాన్ని ఖచ్ఛితంగా లక్ష్యంగా చేసుకొనుటకు మూత్రనాళము ద్వారా కంట్రోల్డ్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ అందించబడుతుంది.
“ఆరోగ్య సంరక్షణ అందించేవారు మరియు కంపెనీలు ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క నిర్ధారణ మరియు చికిత్సలలో వచ్చిన తాజా అభివృద్ధి మరియు సాంకేతిక పురోగతులను గురించి క్రమంగా మరియు పారదర్శకంగా షేర్ చేసినప్పుడు, రోగులు వారి ఆరోగ్యము మరియు జీవన నాణ్యత గురించి అవగాహన కలిగిన నిర్ణయాలు తీసుకొనుటకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రోస్టేట్ ఆరోగ్యము మరియు TULSA-PRO వంటి అధునాతన చికిత్సా విధానాల గురించిన అవగాహన పురుషులు తమ వ్యక్తిగత అవసరాలు మరియు ప్రాధాన్యతలతో పరిష్కారాలను కనుగొనటకు సహాయపడుతుంది. అతితక్కువ కోతలు, నిర్ధిష్ట విధానముతో, TULSA-PRO అర్హులైన రోగులు మూత్ర నిగ్రహం మరియు క్రియాత్మక అంగస్తంభనలను రక్షించుకోవడములో సహాయపడుతూ, వారు తిరిగి తమ రోజువారి పనులను చేసుకొనుటకు మరియు ఈ విధానము-తరువాత మెరుగైన జీవన నాణ్యతను అనుభవించే అవకాశం ఇస్తూ కోలుకోవడాన్ని లక్ష్యంగా కలిగి ఉంటుంది. ఈ పురోగతుల గురించి పురుషులకు అవగాహన ఉన్నప్పుడు, వారు తమ వైద్యులతో అర్థవంతంగా మాట్లాడగలుగుతారు మరియు వారి చికిత్స గురించి విశ్వాసముతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు” అని అనీష్ కౌశల్, Tulsa Pro కొరకు అధికార ప్రతినిధి మరియు బిజినెస్ హెడ్-మెడికల్ డివిజన్, DSS ఇమేజ్టెక్ ప్రి. లి. అన్నారు.[BG1]
ఏడాదికి పైగా TULS-PRO® భారతదేశములో వైద్యులు ప్రోస్టేట్ వ్యాధులకు అసమానమైన ఖచ్ఛితత్వము మరియు అతితక్కువ దుష్ప్రభావాలతో చికిత్సను అందించుటకు సహాయపడుతొంది. FDA-ఆమోదం పొందిన ఈ సాంకేతికతలో, రోగులు వేగంగా కోలుకోవడముతోపాటు సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.






కామెంట్లు (0)