నవతెలంగాణ - హైదరాబాద్: ప్రతి జార్లోనూ కనిపించే చిన్న చిన్న తాజా అల్లం ముక్కలతో కూడిన తేనెను కలిగి ఉన్న వి-రిచ్, అమెజాన్ మరియు బ్లింకిట్ ద్వారా తమ జింజర్ హనీని ప్రధాన మెట్రో నగరాలలో సరఫరా చేస్తోంది.
హైదరాబాద్ నవంబర్ 2026 : ఆధునిక క్లీన్-లేబుల్ బ్రాండ్ అయిన వి-రిచ్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో సహా ప్రధాన మెట్రో మార్కెట్లలో తమ జింజర్ హనీ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. అమెజాన్ , బ్లింకిట్ ద్వారా ఈ జింజర్ హనీ (అల్లం తేనె) లభించనుంది. శీతాకాలం ఆరంభంతో అల్లం, తేనెలను విరివిగా వినియోగించే ఆహారపు అలవాట్లకు కుటుంబాలు తిరిగి వెళ్తోన్న తరుణంలో ఇది అందుబాటులోకి వచ్చింది.
ఈ జింజర్ హనీను పచ్చి అల్లం, తేనెతో కలిపి రూపొందించారు. సీసాలలో నింపే ముందు చిన్న చిన్న ముక్కలుగా కోసిన అల్లం ను దీనిలో జోడించారు. ఇందులో చక్కెర పాకం, కృత్రిమ పొడులు లేదా సింథటిక్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవీ కలపలేదు కాబట్టి, అల్లం ముక్కలు జార్ అంతటా స్పష్టంగా కనిపిస్తాయి. అల్లం తిన్నప్పుడు, అల్లం తనదైన ప్రత్యేకమైన తాజా సువాసనతో పాటు చక్కని రుచిని అందిస్తుంది; దీనికి సహజమైన తేనె తోడవ్వడంతో రుచి సమతుల్యంగా ఉంటుంది. రోజువారీ శీతాకాలపు పానీయం కోసం ప్రతిసారీ అల్లం ఒలవడం, ముక్కలుగా కోయడం, దంచడం వంటి అవసరం లేకుండా వేడినీరు లేదా టీలో ఒక చెంచా జింజర్ హనీ కలుపుకోవచ్చు.
వి-రిచ్ తమ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుండి నాణ్యత , పదార్థాల పారదర్శకత ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. రోజువారీ గృహ వినియోగం కోసం రూపొందించే ప్రతి ఉత్పత్తిలోనూ వీటిని అనుసరిస్తోంది.
వి-రిచ్ వ్యవస్థాపకురాలు , సీఈఓ యోగిత జాహ్నవి మాట్లాడుతూ, "భారతీయ గృహాలలో, ముఖ్యంగా చలికాలంలో, అల్లం మరియు తేనె మనకు సుపరిచితమైన పదార్థాలు. కానీ ప్రతిసారీ తాజా అల్లాన్ని సిద్ధం చేయడానికి శ్రమ పడాల్సి ఉంటుంది. నిజమైన అల్లం వినియోగ అనుభూతిని కొనసాగిస్తూనే, రోజువారీ అలవాట్లలో సులభంగా భాగం చేసుకునేలా జింజర్ హనీని మేము రూపొందించాలనుకున్నాము. మా వరకూ, ఆవిష్కరణ అంటే సాంప్రదాయ పదార్థాల ప్రామాణికత కోల్పోకుండా వాటిని మరింత సౌకర్యవంతంగా మార్చడమే" అని అన్నారు.
ఇది 250ml మరియు 500ml సైజులలో అధికారిక వి-రిచ్ వెబ్సైట్లో లభిస్తుంది. అదే సమయంలో, భారతదేశ వ్యాప్తపు ఆర్డర్ల కోసం అమెజాన్ వంటి భాగస్వామ్య ప్లాట్‌ఫారమ్‌లలో , హైదరాబాద్, బెంగళూరు నివాసితుల కోసం బ్లింకిట్‌లో 250ml ప్యాక్‌లను వేగంగా పొందవచ్చు.







కామెంట్లు (0)