Magazines

స్ట్రింగ్ మెటావర్స్ లాభంలో 92.3% భారీ వృద్ధి..ఆదాయంలో 86.1% పెరుగుదల, ఏజెంటిక్ గేమింగ్‌పై ప్రత్యేక దృష్టి

1 గంట క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : వెబ్‌3 (Web3), బ్లాక్‌చైన్ మరియు ఏఐ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థ 'స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్' (BSE: META), 30 సెప్టెంబరు 2026తో ముగిసిన త్రైమాసికం మరియు అర్ధభాగపు సమగ్ర ఆర్థిక ఫలితాలను నేడు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2027 తొలి అర్ధభాగంలో (H1 FY27) కంపెనీ కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 86.1% పెరిగి రూ.802.66 కోట్లకు చేరగా, పన్ను తదుపరి నికర లాభం (PAT) 92.3% జంప్ చేసి రూ.76.79 కోట్లకు చేరింది. ఇబిట్డా (EBITDA) మార్జిన్ పుంజుకోవడంతో, రాబడి కంటే ఆదాయ వృద్ధి మరింత వేగాన్ని పుంజుకుంది.

తొలి అర్ధభాగంలో అద్భుత ఆర్థిక పనితీరు (H1 FY27): 30 సెప్టెంబరు 2026తో ముగిసిన తొలి అర్ధభాగంలో, కంపెనీ కార్యకలాపాల రాబడి ఏడాది ప్రాతిపదికన 86.1% పెరిగి రూ.802.66 కోట్లకు చేరింది. ఇబిట్డా (PBDIT) 91.3% వృద్ధితో రూ.91.18 కోట్లకు పెరిగింది. దీనితో ఇబిట్డా మార్జిన్ 31 బేసిస్ పాయింట్లు మెరుగై 11.4 శాతానికి చేరింది. పన్ను తదుపరి లాభం 92.3% పెరిగి రూ.76.79 కోట్లుగా నమోదైంది.

రెండో త్రైమాసిక పనితీరు (Q2 FY27): 30 సెప్టెంబరు 2026తో ముగిసిన రెండో త్రైమాసికంలో, కంపెనీ రాబడి ఏడాది ప్రాతిపదికన 76.5% పెరిగి రూ.410.26 కోట్లకు చేరింది. ఇబిట్డా 83.2% పెరిగి రూ.47.32 కోట్లకు చేరుకోగా, ఇబిట్డా మార్జిన్ 42 బేసిస్ పాయింట్లు పెరిగి 11.5 శాతానికి చేరింది. నికర లాభం 84.2% పెరిగి రూ.39.86 కోట్లకు చేరింది. ఇక క్రితం త్రైమాసికంతో (Q1 FY27) పోలిస్తే,క్యూ2 రాబడి 4.6%, నికర లాభం 7.9% వృద్ధి సాధించాయి.

హెచ్1 ఎఫ్‌వై27 కీలక మైలురాళ్లు: ఎఫ్‌వై27 తొలి ఆరు నెలల్లోనే, కంపెనీ తన గడిచిన ఆర్థిక సంవత్సరం (FY26) మొత్తం రాబడిలో 75.1% మరియు నికర లాభంలో 74.9% సాధించడం విశేషం. అంతేకాకుండా సమతుల్య వృద్ధి, లాభదాయకతను కొలిచే ప్రమాణమైన ‘రూల్ ఆఫ్ 40’ స్కోరులో, బెంచ్‌మార్క్ 40% కంటే రెండింతల కంటే ఎక్కువగా 87.4% సాధించింది.

మేనేజింగ్ డైరెక్టర్ వ్యాఖ్య: 

"ఎఫ్‌వై27 తొలి అర్ధభాగం స్ట్రింగ్ మెటావర్స్ ప్రయాణంలో ఒక కీలకమైన సమయం. గత ఏడాది మొత్తం రాబడి, లాభాల్లో మూడు వంతుల శాతాన్ని కేవలం ఆరు నెలల్లోనే సాధించడంతో పాటు మార్జిన్లను విస్తరించడం.. మా వ్యాపార వృద్ధి లాభదాయకమైనదని నిరూపిస్తోంది. ప్రస్తుతం మేము ఏజెంటిక్ గేమింగ్, ఏఐ ఏజెంట్ల పేమెంట్ రైల్స్ మరియు సమగ్ర ఏఐ ఎకోసిస్టమ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కంపెనీ తదుపరి దశ వృద్ధికి చోదక శక్తిగా నిలిచే డిజిటల్ వ్యాపారాలను నిర్మించేందుకు ఇక్కడ మాకు విస్తృత అవకాశాలు కనిపిస్తున్నాయి." 

— గణేష్ మీనవల్లి, మేనేజింగ్ డైరెక్టర్, స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్