Magazines

అంగన్వాడి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోండి 

35 నిమిషాల క్రితం

nutritious food
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

రాజుల కొత్తపల్లి సెక్టర్ సూపర్వైజర్ సుధా 

హనుమాన్ నగర్ తండా గ్రామ సర్పంచ్ అశోక్ కుమార్

నవతెలంగాణ-నెల్లికుదురు

అంగన్వాడి సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని కిషోర్ బాలికలు గర్భిణీ స్త్రీలు బాలాంతలు సద్వినియోగం చేసుకోవాలని హనుమాన్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ సూపర్వైజర్ సుధా తెలిపారు. శుక్రవారం గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు, చిన్నారులకు హనుమాన్ నగర్ తండాలో ఐసిడిఎస్ అంగన్వాడి ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి) శుక్రవారం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా 15 మందితో కూడిన కమిటీకి కన్వీనర్ గా సర్పంచ్ అశోక్ కుమార్ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలల సంరక్షణలో కమిటీ పాత్ర కీలకమన్నారు. పిల్లలపై జరిగే నేరాలనియంత్రణ, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణ, శారీరక మానసిక వేధింపుల నుంచి సంరక్షించడానికి పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి విసిపిసి కమిటీ కృషి  చేస్తుందని తెలిపారు. బాలికలకు, పిల్లలకు ఇతరుల నుంచి ఇబ్బందులు తలెత్తితే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, అంగన్వాడీ టీచర్లు గుగులోతు శారద, గుగులోతు మైబు, జయశ్రీ, ఆశా వర్కర్లు, గర్భిణీలు బాలింతలు కిషోర్ బాలికలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్