నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, వివాహితులైన పురుష ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులను (paternity leave) ప్రకటించారు. ఈ మేరకు ఆయన అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. అర్హులైన ఉద్యోగులు ఈ సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శిశువు జన్మించడానికి 15 రోజుల ముందు నుండి లేదా శిశువు జన్మించిన ఆరు నెలల లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీనివల్ల ప్రసవ సమయంలో వారు తమ భార్యలకు తోడుగా ఉండే అవకాశం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ రాష్ట్రంలో 15 రోజులు పితృత్వ సెలవులు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)