నవతెలంగాణ - హైదరాబాద్ : టెస్టు క్రికెట్లో అరుదైన ఘనతను యువ భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ సాధించాడు. తన కెరీర్లో తొలి 33 టెస్టులను విభిన్న వేదికల్లో ఆడిన ఇద్దరు భారత ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గతంలో ఈ ఘనతను సంజయ్ మంజ్రేకర్ సాధించగా.. ఇప్పుడు యశస్వి ఆయన సరసన నిలిచాడు.
2023లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన యశస్వి.. ఇప్పటివరకు 2,697 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. 1994 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా యశస్వి నిలిచాడు.






కామెంట్లు (0)