నవతెలంగాణ-హైదరాబాద్: 33వ ఏపెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా, షెన్జెన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య త్రైపాక్షిక సమావేశం జరుగుతోంది. ఈ చారిత్రాత్మక త్రైపాక్షిక చర్చలలో, అణ్వాయుధ నిరాయుధీకరణ, ఇరాన్‌తో కొనసాగుతున్న వివాదం, ప్రపంచ వాణిజ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలపై నాయకులు చర్చించే అవకాశం ఉంది. ఏపెక్ ఆర్థిక నాయకుల సమావేశం కోసం బుధవారం షెన్జెన్లో ఈ మూడు ప్రధాన శక్తులు దౌత్యపరమైన కార్యకలాపాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రపంచ శాంతిని పెంపొందించే దిశగా చర్చలు జరపాలని జి జిన్‌పింగ్ పిలుపునివ్వడంతో ఈ త్రైపాక్షిక భేటీ ప్రారంభమైంది. "ప్రధాన దేశాలు సామరస్యంగా జీవించినప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది; అవి ఘర్షణ పడితే ప్రపంచం అల్లకల్లోలమవుతుందని చరిత్ర చెబుతోంది" అని ఆయన పేర్కొన్నారు.







కామెంట్లు (0)