నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పరుగుల వరద పారించింది. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 720 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో న్యూజిలాండ్‌పై 352 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. తొలి ఏడు వికెట్ల భాగస్వామ్యాల్లోనూ 50కి పైగా పరుగులు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కేఎల్ రాహుల్ (136), రిషబ్ పంత్ (128) సెంచరీలతో అదరగొట్టగా.. యశస్వి జైస్వాల్ (85), దేవదత్ పడిక్కల్ (80), శుభ్‌మన్ గిల్ (98), ధ్రువ్ జురెల్ (78) రాణించారు. బ్యాటర్లు వరుస భాగస్వామ్యాలతో భారీ స్కోరు సాధించారు. న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు, న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన అత్యధిక టెస్టు స్కోరు సహా పలు రికార్డులు ఈ ఇన్నింగ్స్‌లో నమోదయ్యాయి.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత..
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)