నవతెలంగాణ - హైదరాబాద్ : భారత బౌలర్ ఆకాశ్ దీప్ (5/99) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. తొలి రోజు రెండు వికెట్లు తీసిన అతడు.. రెండో రోజూ న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేస్తూ మరో మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాట్ హెన్రీ (19)ను ఔట్ చేయడంతో ఆకాశ్ దీప్ ఐదు వికెట్ల ఘనత సాధించాడు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది. టామ్ లేథమ్ (59), టామ్ బ్లండెల్ (89) అర్ధ సెంచరీలతో రాణించారు.
టెయిలెండర్ మ్యాట్ హెన్రీతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బ్లండెల్ సెంచరీకి చేరువలో వెనుదిరిగాడు. గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించగా, బౌండరీ వద్ద ఆకాశ్ దీప్ అద్భుతమైన క్యాచ్ అందుకుని అతడిని పెవిలియన్‌కు పంపాడు. దీంతో బ్లండెల్ సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా నిర్ణయాత్మక చివరి టెస్టు కొనసాగుతోంది. తొలి రోజు 246/5తో ఆట ముగించిన న్యూజిలాండ్.. రెండో రోజు భారత బౌలర్ల ధాటికి మిగిలిన వికెట్లు కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ (36)ను అన్షుల్ కాంబోజ్, నాథన్ స్మిత్ (26), కైల్ జేమీసన్ (19)లను ఆకాశ్ దీప్ ఔట్ చేశారు. చివరకు కివీస్ 356 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది.






కామెంట్‌లు (0)