త్రిబుల్ ఆర్ దక్షిణాన భూసేకరణ నోటిఫికేషన్

4 గంటల క్రితం

RRR
avatar
balaji

ప్రచురించబడింది నవం 28, 2026 | 2 నిమిషాల చదవడం

90 గ్రామాల పరిధిలో 4,962.42 ఎకరాల భూ సేకరణ

వేగవంతం అవుతున్న భూసేకరణ ప్రక్రియ


నవతెలంగాణ-సంస్థాన్
నారాయణపురం ​త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ సేకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ సంయుక్తంగా జీవోఎంఎస్ నెం.264ను ఈనెల 6న జారీ చేశాయి. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. త్రిబుల్ ఆర్ దక్షిణభాగం పరిధిలో వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, యాదాద్రి, సంగారెడ్డి 6 జిల్లాల్లోని 20 మండలాలు.. 90 గ్రామాల పరిధిలో 4,962.42 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు తెలుస్తోంది. 100 మీటర్ల వెడల్పుతో 201 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రోడ్డుకు రూ.14,507 కోట్లు ఖర్చుకు ప్రభుత్వం అంచనా వేసినట్టు తెలుస్తోంది. నిర్మాణ బాధ్యతలను హెచ్‌‌జీసీఎల్‌ సంస్థకు అప్పగించిన‌ట్టు ప్రచారం జరుగుతోంది.​యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ త్రిబుల్ ఆర్ దక్షిణ భాగంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల నుంచి 387.30 ఎకరాల భూమి సేకరణ చేయనున్నట్టు తెలుస్తుంది.

చౌటుప్పల్ మండలం తంగడపల్లి రెవెన్యూ పరిధిలో 80 ఎకరాల 11 గుంటలు, నారాయణపురం మండల పరిధిలోని గుడిమల్కాపురంలో 9 ఎకరాల 30 గుంటలు, కొత్తలాపురంలో 22 ఎకరాల 22 గుంటలు, చిమిర్యాలలో 25 ఎకరాల 12 గుంటలు, సర్వేలులో 139 ఎకరాల 29 గుంటలు, కంకణాలగూడెంలో 25 ఎకరాల 23 గుంటలు, పుట్టపాకలో 84 ఎకరాల 20 గుంటల చొప్పున మొత్తం 387.30 గుంటలు సేకరించనున్నట్టు తెలుస్తోంది. ​నల్లగొండ జిల్లాలో.. గట్టుప్పల్, చండూరు, చింతపల్లి, మర్రిగూడెం మండలాల పరిధిలో 14 గ్రామాల్లో 818.36 ఎకరాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 11 గ్రామాల్లో 544.10 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలోని 4 మండలాల పరిధి 23 గ్రామాల్లో 1,016.27 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 28 గ్రామాల్లో 1869.30 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలోని రెండు మండలాల పరిధి ఏడు గ్రామాల్లో 327.09 ఎకరాల చొప్పున మొత్తం 20 మండలాల పరిధిలోని 90 గ్రామాల్లో 4,962.42 ఎకరాలు సేకరించనున్నారు.



త్రిబుల్ ఆర్ దక్షిణభాగం

జిల్లాలు మండలాలు గ్రామాలు ఎకరాలు

1.రంగారెడ్డి 7 28 1869.30

2.వికారాబాద్ 4 23 1016.27

3.నల్లగొండ 4 14 818.36

4.మహబూబనగర్ 1 11 544.10

5. యాదాద్రి 2 7 387.30

6. సంగారెడ్డి 2 7 327.09

మొత్తం 20 90 4,962.42

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్