నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో 275 ఎస్సై (సివిల్) పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పోస్టులకు 1.60 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష సమయానికి గంట ముందే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్‌టికెట్‌పై ఫొటో లేకపోయినా పరీక్షకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
రేపు ఎస్సై పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)